Advertisement
బిర్యానీ అనే పదం Birian అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది. Birian అంటే, పర్షియన్ భాషలో fried before cooking అనే అర్థం వస్తుంది. అంటే వండేందుకు ముందుగా ఫ్రై చేయడమని అర్థం. ఇక బిర్యానీని కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు. అందుకనే దాన్ని బిరియన్ అని మొదట్లో పిలిచేవారు. తర్వాత అదే బిర్యానీ అయింది. కాగా మొదట బిర్యానీని 1398లో తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది.
Advertisement
అప్పట్లో టర్క్ మంగోల్ చక్రవర్తి టిమూర్, ఓ కుండలో బియ్యం, మసాలాలు, మాంసం తదితర అన్ని పదార్థాలను వేసి బాగా ఉడికించి, బిర్యానీ తరహా ఆహారాన్ని తయారు చేయించాడని చరిత్రకారులు చెబుతారు. అయితే క్రీస్తు శకం రెండవ శతాబ్దంలోనే అరబ్ వర్తకులు బిర్యానీని మన దేశానికి పరిచయం చేశారని మరికొందరు అంటారు. అప్పట్లో వారు దీన్ని Oon soru అనే తమిళ పేరుతో పిలిచేవారట. అయితే నిజానికి అసలైన హైదరాబాద్ బిర్యాని మాత్రం మొగల్ చక్రవర్తులే తయారు చేయించినట్లు ఆధారాలు ఉన్నాయి.
Advertisement
మొగల్ చక్రవర్తుల కాలంలో ఓసారి మహారాణి ముంతాజ్ సైనిక స్థావరాల వద్దకు వెళ్లి చూడగా, సైనికులందరూ చాలా బలహీనంగా, శక్తి లేనట్లు కనిపించారట. దీంతో ఆమె సైనికులకు బలవర్ధక ఆహారం అందించాలని చెప్పి, బియ్యం, మాంసం, మసాలాలు వేసి వండి బిర్యానీని తయారు చేయించింది. అలా మొగలులు మొదట బిర్యానీని మన దేశంలో తయారు చేశారు. ఈ క్రమంలో ఓసారి హైదరాబాదుకు చెందిన నిజాం నవాబు ఆ బిర్యానీని రుచి చూసి దానికి ఫిదా అయి దాన్ని హైదరాబాదుకు పరిచయం చేశారు. దీంతో హైదరాబాదులో బిర్యాని అప్పటి నుంచి వండడం మొదలుపెట్టారు. అది అలా అలా హైదరాబాది బిర్యాని అయింది. అనంతరం హైదరాబాదీ బిర్యానీ విశ్వవ్యాప్తమైంది. అయితే మన దేశంలో భిన్న ప్రాంతాలకు చెందిన వారు భిన్న రకాలుగా బిర్యానీలను తయారు చేస్తారు.
READ ALSO : గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్ భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?