Advertisement
ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. భర్త, భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య, భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. భర్తకి ఓ సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా అన్నిటికీ మించి ప్రేమగా, భక్తిగా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదని అంటుంటారు.
Advertisement
Read also: విమానాల్లో ప్రయాణం చేస్తప్పుడు అస్సలు చెప్పకూడని ఈ 4 పదాలు ఏంటో తెలుసా ? చెబితే జైలు కే!
Advertisement
ముఖ్యంగా కొందరు భార్యలు భర్తలను అసలు లెక్క చేయరు. నువ్వెంత అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. పొరపాటున కూడా భార్య, భర్తని అగౌరవపరచకూడదు. అందులో భార్య, భర్తని అనకూడని మాటలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దాంపత్య జీవితంలో కొన్నిసార్లు గొడవలు తలెత్తినప్పుడు భార్యాభర్తలు కోపంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారు. అలా ఎలాంటి సందర్భం వచ్చినా భార్య, భర్తని బంధువుల ఫంక్షన్ లో కానీ మరే ఇతర పబ్లిక్ ప్లేస్ లోనైనా తక్కువ చేసి, చులకనగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. దానివల్ల భర్తకి అగౌరవంతో పాటు ఆమెకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక మరో విషయం మెట్టినంటి విషయాలను పొరపాటున కూడా పుట్టింటికి చెప్పకూడదంటారు.
దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. భర్తల నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వాలి. అలా చేయకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక మరి కొంతమంది పిల్లల ముందే భర్తలను తిడుతుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎటువంటి విషయమైనా ఏకాంత సమయంలో మాట్లాడుకోవాలి తప్ప పిల్లల ముందు మాట్లాడకూడదు. భర్త బలహీనతల గురించి భార్య ఎగతాళి చేయకూడదు. ఇక మరొక విషయం భర్త గురించి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అసలు చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల ఆయనకి గౌరవం తగ్గుతుంది.