Advertisement
బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడానికి, అలాగే బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఎక్కువగా రాత్రి వేళలలో అన్నం మానేసి చపాతీలు తింటున్నారు. అయితే రాత్రి సమయంలో చపాతీ మంచిదా? లేక భోజనం మంచిదా అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. అయితే ఉన్నఫలంగా అన్నం మానేసి చపాతిని తినడం మంచిది కాదని చెబుతున్నారు డాక్టర్లు. ఒక పూట అన్నం పూర్తిగా మానేసే బదులు.. తక్కువగా అన్నం తీసుకుని ఆస్థానంలో చపాతీలు తినమని సూచిస్తున్నారు. అలాగే చపాతీలలో నూనె కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు ఆ బరువుని తగ్గించుకోవడానికి చపాతీలను తింటే మంచిదని చెప్పవచ్చు. కూరగాయలు, పెరుగు, పప్పుతో చపాతీలను తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి. చపాతీల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటివి లభిస్తాయి. బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్లు ఊపిరితిత్తులు, ఆస్తమా, దగ్గు, ఆయాసం ఉన్నవాళ్లు రాత్రులు భోజనం మానేసి చపాతి తినడం మంచిది. చపాతి, రోటీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఫైబర్ ఉండడం వల్ల చపాతీలను తినే వాళ్లకు త్వరగా ఆకలి వేసే అవకాశం ఉంది. పాలీష్ బియ్యం తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. అలాగే చపాతీలు ఎంత ఎక్కువసేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని చెబుతున్నారు డాక్టర్లు.
అలా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్, అల్సర్, గ్యాస్ వంటి కడుపు సంబంధించిన రోగాలు దరి చేరవని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే చాలామంది తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే బరువు తగ్గడానికి అన్నానికి బదులుగా చపాతీ తినడం మంచిదే. అయితే వాటిని ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే. చపాతీలను ఎక్కువగా కూడా తినకూడదు. బరువు తగ్గడానికి రోజుకి కనిష్టంగా నాలుగు చపాతీలు తినడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు మధ్యాహ్న సమయంలో రైస్ తీసుకున్నా పర్వాలేదు కానీ రాత్రి సమయంలో మాత్రం తప్పనిసరిగా చపాతీలను తీసుకోవాలని నిపుణుల సూచన.
Read also: పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది.. వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. ట్విస్ట్ ఏంటంటే..?