Advertisement
ఎప్పుడూ వివాదాలతోనే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేరు మార్మోగుతుంటుంది. వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దానికోసం ఆయన ఓ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆమధ్య నిమిషం గ్యాప్ లో కేసీఆర్ కాళ్లపై రెండుసార్లు పడ్డ డీహెచ్ ను చూసి ఇదంతా కన్ఫామ్ అని అంతా అనుకున్నారు. దీనిపై తీవ్ర చర్చ సాగింది.
Advertisement
ఇటు కరోనాను క్రీస్తు తరమేశారన్న ఆయన వ్యాఖ్యలపైనా దుమారం రేగింది. అంతకుముందు వెరైటీ పూజలు చేసి వార్తల్లోకెక్కారు. ఇలా ఏదో ఒక వివాదంతో హెడ్ లైన్స్ కు ఎక్కుతున్నారు శ్రీనివాసరావు. తాజాగా ముగ్గుల పోటీకి సంబంధించి ట్విట్టర్ లో ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో సెల్ఫీ తీసి వాట్సాప్ పంపి.. బంగారం గెలుచుకోండంటూ ఆయన మహిళలకు బంపరాఫర్ ఇచ్చారు.
Advertisement
విజేతలకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఇందులో మొదటి 10 మందికి బహుమతిగా ఒక గ్రామ్ బంగారం.. తర్వాతి 50 మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం ఇస్తామని వెల్లడించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో డీజీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సెల్ఫీ విత్ రంగోలి అనే కార్యక్రమం చేపడుతున్నామన్నారు శ్రీనివాసరావు.
జిల్లాలోని మహిళలు, యువతులు అందరూ ఈ పోటీల్లో పాల్గొని గోల్డ్ కాయిన్ ను గెలుచుకోవచ్చన్నారు డీహెచ్. పండుగకు మీ ఇంటి ముందు మీరు వేసిన ముగ్గుతో సెల్ఫీ లేదా వీడియో తీసి మీ పేరు, గ్రామం, మండలం వివరాలతో జనవరి 15 సాయంత్రం 6 గంటల లోపు వాట్పాప్ చేయాలన్నారు. విజేతలకు జనవరి 26న కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో బహుమతి ప్రదానం చేస్తామని ప్రకటించారు శ్రీనివాసరావు.