Advertisement
ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అర నిమిషంలో తెలిసిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఏ వేదికైనా వారిలో ఉన్న టాలెంట్ ను లేదంటే బాధను లక్షలాది మందితో పంచుకునే ప్లాట్ ఫామ్ గా మారింది.. అలా ఫేస్బుక్ యువతి జీవితాన్ని కాపాడిందని చెప్పవచ్చు. ఆమె చేసిన పోస్టు ఆమె న్యాయ పోరాటంలో గెలవడానికి ఎంతో ఉపయోగపడింది.. మరి ఆ కథ ఏంటో చూద్దాం.. అది రాజస్థాన్ రాష్ట్రం.. సుశీల్ బిస్నోయి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆమె కంటే ఆరేళ్లు పెద్దవాడైన నరేష్ తో వివాహం చేశారు.
Advertisement
ఇక అప్పటినుంచి ఆమె తన పుట్టింట్లోనే గడిపింది. 18 ఏళ్లు నిండగానే అత్తింటి వారు తీసుకెళ్లడానికి వచ్చారు. కానీ ఆమె వెళ్లనని చెప్పింది. కానీ తల్లిదండ్రులు ఎలాగోలా ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను అక్కడికి పంపారు. దీంతో అత్తింటి వారి వేధింపులను తట్టుకోలేక విసుకు చెందిన యువతీ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఏకంగా న్యాయ పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని సారథి ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న భారతీని కలిసింది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది.
Advertisement
దీంతో రంగంలోకి వచ్చిన భారతి సుశీల బంధువులను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరింది. ఎవరు సహకరించలేదు. దీంతో సాక్షాదారాల కోసం ఫేస్బుక్ లో తన భర్త సుశీలతో దిగిన కొన్ని ఫోటోలను అప్లోడ్ చేశారు. వాటిని సాక్షాదారాలుగా తీసుకొని కోర్టులో సమర్పించారు. ఇక భోద్పూర్ కోర్టు ఆమెది బాల్య వివాహమే అని తీర్పునిచ్చి పెళ్లి రద్దు చేసింది. ఆ తర్వాత సుశీల ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీ కూడా చదివి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. ఈ తరుణంలో ఆమె మాట్లాడుతూ తనలాంటి బాధితులని రక్షించడమే తన లక్ష్యమని సుశిల చెబుతోంది.
also read: పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందించిన చిరు.. ఏమన్నారో తెలుసా..?