Advertisement
అధునాతన సౌకర్యాలతో రూపొందించిన గంగా విలాస్ నౌకను ఈమధ్యే ప్రారంభించారు ప్రధాని మోడీ. వారణాసిలోని గంగా హారతితో మొదలై బిహార్ లోని విక్రమశిల యూనివర్సిటీ, పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ డెల్టా, అసోంలోని కజిరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను చుట్టుముట్టి దిబ్రుగార్ కి చేరుకుంటుంది ఈ నౌక. 51 రోజుల పాటు సాగే ఈ ప్రయాణం 3200 కిలోమీటర్ల పాటు సాగుతుంది.
Advertisement
ఈ నౌక టూర్ లో ఒక్కొక్కరికి రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం 36 మంది పర్యాటకులు మాత్రమే ప్రయాణించే వీలుంది. అయితే.. ఈ నౌకా ప్రయాణానికి 2024 ఏప్రిల్ వరకు బుకింగ్ లు పూర్తయ్యాయి. టూర్ కి వెళ్లాలనుకునేవారు ఆతర్వాతి తేదీలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ నౌక విషయంలో బీజేపీ ప్రచారాన్ని తప్పుబట్టారు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఇది గత 17 సంవత్సరాల నుంచి నడుస్తోందని అన్నారు.
Advertisement
కేవలం కొన్ని మార్పులు మాత్రమే చేసి.. ఏదో కొత్త నౌకను లాంచ్ చేసినట్టు దాన్ని తామే ప్రారంభించామని బీజేపీ వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు అఖిలేష్. ఇలాంటి ప్రచారాలు చేసుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని సెటైర్లు వేశారు. అఖిలేష్ వ్యాఖ్యలపై కమలనాథుల సైడ్ నుంచి ఘాటైన కౌంటర్స్ వస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే.. ఈ నౌక నది మధ్యలో ఆగిపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రారంభమైన మూడు రోజులకే గంగా విలాస్ ఆగిపోయింది. చాప్రా జిల్లాలోని డోరీగంజ్ ఏరియాలో ఇది చిక్కుకుపోయింది. గంగానదిలో తగినంత నీరు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిజానికి నది ఒడ్డుకు ఈ నౌక చేరుకున్న తరువాత పురావస్తు ప్రాధాన్యం గల హెరిటేజ్ సైట్ చిరండ్ కు వెళ్లాలని టూరిస్టులు తహతహలాడారు. చిరండ్ సరన్ అని వ్యవహరించే ఈ సైట్ అక్కడికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఘాఘ్రా నది ఒడ్డున గల ఈ విహార స్థలంలో హిందూ, బౌద్ధిజం, ముస్లిం సంస్కృతులు ఉంటాయి. నౌక నిలిచిపోయిన సమాచారం తెలిసిన వెంటనే చిన్నబోట్ల ద్వారా టూరిస్టులను ఆ సైట్ వద్దకు చేర్చారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. అక్కడ వారి వసతికి తగిన ఏర్పాట్లు చేశారు.