Advertisement
కొరటాల శివతో స్టార్ హీరోల సినిమా అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా కాదు. మిర్చి సినిమా తర్వాత ఆయన రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన చేసిన జనతా గ్యారేజ్ సినిమా అయితే సూపర్ హిట్ అయింది. కమర్షియల్ గా కూడా నిర్మాణ సంస్థకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది అనే మాట వాస్తవం.
Advertisement
ఇప్పుడు కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెట్టారు. అయితే జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కు పెద్దనాన్నగా బాలకృష్ణను తీసుకుంటే బాగుండేది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తే, ఆయన మాత్రం ఆ కాంబోని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పారు. మోహన్ లాల్ ను అందరూ కమర్షియల్ గా ఎంపిక చేశారని భావించిన ఆయన మాత్రం కాదని కొట్టిపారేశారు.
Advertisement
ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. ఒక సహజ నటుడు కావాలని ఆలోచనలో భాగంగానే ఆ పవర్ ఫుల్ పాత్రకు ఆయన్ను ఎంపిక చేసామని, ఎన్టీఆర్ రేంజ్ ఎక్కువ మోహన్ లాల్ అయితే బాగుంటుంది అని ఆలోచనతోనే ఆ అడుగు వేసినట్టుగా చెప్పారు. బాలకృష్ణని తీసుకుంటే ప్రేక్షకులు సినిమా కథ వదిలేసి బాబాయి, అబ్బాయిలను చూస్తారని, అది చాలా పవర్ఫుల్ కాంబినేషన్ కాబట్టే తాను ఆ అడుగు వేయలేదు అన్నారు. దానికి ఇంకా బలమైన కథ కావాలని కొరటాల శివ స్పష్టం చేశారు.
READ ALSO : విరా ట్ కోహ్లీ కి జనవరి 15 తో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?