Advertisement
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది. మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాలతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా చాలా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. కేవలం నాలుగు రోజులలోనే వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది వాల్తేరు వీరయ్య. ఇప్పటికీ భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ సినిమాని మరింత ప్రమోట్ చేసేందుకు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది మూవీ యూనిట్.
Advertisement
Read also: ఎన్టీఆర్ తో కలిసి నటించాల్సిన బాలయ్య బాబు “జనతా గ్యారేజ్” సినిమా ని ఎందుకు రిజెక్ట్ చేసాడు ?
Advertisement
ఈ సందర్భంగా దర్శకుడు బాబి, కమెడియన్ వెన్నెల కిషోర్, మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన పలు విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో చిరంజీవి వేరుశనగలు నములుతూ.. దాని పొట్టుని మాస్ గా గాల్లోకి ఊదే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశం కోసం తన ఇంట్లో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని బయటపెట్టారు మెగాస్టార్. ఈ సన్నివేశాన్ని చిరు మాటల్లో.. ” సెట్ లో ఈ సన్నివేశం ఉదయం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది.
వేరుశనగలు తీసుకు రమ్మని చెబితే సెట్ ప్రాపర్టీ వాళ్లు అటు ఇటు పరిగెత్తుతారేమోనని మా ఇంట్లో నేను పనిమనిషితో నేను షూటింగ్ కి వెళ్లే ముందు వేరుశనగలు పొట్టు ఇస్తావా అని ఆమెని అడిగాను. దానికి ఆమె ఆశ్చర్యపోయి నా వైపు అలా చూసింది. అది ఏం చేసుకుంటారు సార్ అని నన్ను అడిగింది. కావాలంటే పల్లీలు ఇస్తాను అని చెప్పింది. ఆ తర్వాత ఆమెకి అర్థం అయ్యేలా చెప్పి చివరికి ఒక ప్యాకెట్ నిండా పల్లీల పొట్టుతో సెట్ కి చేరుకున్నాను” అని చెప్పుకొచ్చారు. అలా పాత్ర విషయంలో తాను ఎంతో నిబద్ధతతో ఉంటానని చెప్పుకొచ్చారు చిరంజీవి.
Read also: మగవారు తమకంటే తక్కువ వయసున్న స్త్రీలనే ఎందుకు వివాహం చేసుకుంటారు ?