Advertisement
అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. అలాంటి అనుమానం పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. అనుమానం అనేది ఒక్కసారి మనసులోకి ఎక్కితే పాత రోగంలా మారుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు సంతోషంగా ఉండరు. ఎదుటివారు అది నిజం కాదని వారించినా వాళ్లు అనుకున్నదే వాస్తవమని విశ్వసిస్తారు. ఈ అనుమానమే పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. అన్యోన్యంగా బ్రతుకుతున్న భార్యాభర్తల మధ్య ఆగాదాన్ని సృష్టించింది. గొడవలకు కారణమైంది. అంతేకాదు క్షనికావేశంలో భర్త చేసిన పనికి భార్య లోకాన్ని విడిచి వెళ్లేలా చేసింది. అందంగా ఉండటమే ఆ మహిళకు శాపం అయింది.
Advertisement
Read also: మగవారు తమకంటే తక్కువ వయసున్న స్త్రీలనే ఎందుకు వివాహం చేసుకుంటారు ?
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని శుద్ధగుంట పాల్య పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిర్ హుస్సేన్ అనే యువకుడితో నాజ్ (22) అనే యువతికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు బీటీఎం లేఅవుట్ పరిధిలోని తారవకెరె లో నివాసం ఉంటున్నారు. నాజ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నాసిర్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నవ దంపతులు పెళ్లయిన కొన్ని నెలల పాటు అన్యోన్యంగా ఉన్నారు. కానీ పెళ్లి అయిన కొద్ది నెలలకి భార్య అందంగా ఉండడంతో భర్త నాసిర్ కి అనుమానం మొదలైంది. ఆమె ఎవరితో మాట్లాడినా నాసిర్ ఆమెపై కోపం ప్రదర్శించేవాడు. ఆమెకి అక్రమ సంబంధం ఉందని నిత్యం అనుమానించడం మొదలుపెట్టాడు. పక్కింటి వారితో మాట్లాడినా కూడా హింసించేవాడు.
Advertisement
అయితే భర్తలో ఎప్పటికైనా మార్పు వస్తుందేమో అనే నమ్మకంతో అతడి వేధింపులను భరిస్తూ వచ్చింది నాజ్. కానీ అతడి అనుమానం తగ్గకపోగా మరింత పెరిగింది. భార్యని చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆదివారం ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. క్షణికావేశంలో ఆమె గొంతునొక్కి హంతకుడిగా మారాడు. భార్యని హతమార్చి ఆమె సోదరునికి ఫోన్ చేసి చనిపోయిందని చెప్పి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. నాసిర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా అనుమానం పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది.
Read also: సేమ్ TO సేమ్ “ప్రభాస్” లగే ఉన్న ఈ వ్యక్తిని గమనించారా ? ఆ నటుడే…ఎవరో తెలుసా ?