Advertisement
మీలో చాలామంది విమానంలో ప్రయాణించే ఉంటారు. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అది కాక కొన్ని నిషేధిత వస్తువులను వెంట తీసుకురాకూడదని సదరు సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. అయితే చాలామందికి అంతుచిక్కని విషయం ఏంటంటే.. విమానాలలో ప్రయాణించేటప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని, లేదా ఏరోప్లేన్ మోడ్ లో ఉంచమని పదేపదే ఫ్లైట్ అటెండెంట్ లు కోరుతూ ఉంటారు. దీని వెనక ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: సేమ్ TO సేమ్ “ప్రభాస్” లగే ఉన్న ఈ వ్యక్తిని గమనించారా ? ఆ నటుడే…ఎవరో తెలుసా ?
భద్రతా కారణాల దృశ్యా విమానంలో వివిధ రకాల నిబంధనలు పాటిస్తారు. విమానం టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమంటారు సదరు సిబ్బంది. అయితే ఫ్లైట్స్ లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని అధికారికంగా నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA). కానీ ఫ్లైట్ అటెండెన్స్ మాత్రం మీ మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేయాలని చెబుతుంటారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ విధంగా అనౌన్స్మెంట్ చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్, వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే. సెల్ ఫోన్ తో పాటు దాదాపుగా అన్ని పర్సనల్ ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఇది విమాన కాక్ పిట్ లోని ఏరోనాటికల్ పరికరాలకు అంతరాయం కలిగించవచ్చు.
Advertisement
అంతేకాకుండా మీరు అధిక ఎత్తులో ఎగురుతున్నప్పుడు సెల్ ఫోన్లు బలమైన సిగ్నల్స్ పంపుతాయి. తద్వారా ఇది భూమిపై నెట్వర్క్ రద్దీకి కూడా కారణం అవుతుంది. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలు, విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఓకే ఫ్రీక్వెన్సీ లో ఉంటాయి. దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగించవచ్చు. ఇది ప్రమాదానికి దారి తీసే అవకాశాలను సృష్టిస్తుంది. ఈ కారణం చేతనే విమానం టేక్ ఆఫ్, లాండింగ్ సమయాలలో సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయమని ఫ్లైట్ సిబ్బంది కోరతారు. అయితే ఇప్పటివరకు ఇలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు చరిత్రలో లేవు. కానీ ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయమని చెబుతారు.
Read also: విరా ట్ కోహ్లీ కి జనవరి 15 తో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?