Advertisement
ఎంత అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. ఇలాంటి సందర్భాలలో కోపంగా తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఏ గొడవైనా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. భార్యాభర్తల మధ్య వివాదాలు రావడం సహజం. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక అవసరాలు, పిల్లల పెంపకం.. ఇలా చాలా రకాలైన బాధ్యతలు దంపతులపై ఉంటాయి. ఈ క్రమంలో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం సహజం. కానీ చిన్న చిన్న విషయాలకు గొడవపడి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసుకోవడం సరైంది కాదు.
Advertisement
Read also: విరా ట్ కోహ్లీ కి జనవరి 15 తో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?
తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. చంద్రశేఖర్, జ్యోతి ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి 2012లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. భార్య స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. భర్త ఏపీ సిఐడి ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక ఉద్యోగం నిమిత్తం ఈ దంపతులు గత కొంతకాలంగా విజయవాడలోని పటమట లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్ది రోజులపాటు వీరి సంసారం బాగానే సాగింది. కానీ ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి ఈ దంపతులు గొడవ పడుతూ వచ్చారు. ఇటీవల మరోసారి వీరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది.
Advertisement
ఈ నేపథ్యంలో భార్య జ్యోతి తీవ్ర మణస్థాపానికి గురైంది. దీంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. మధ్యాహ్నం పిల్లలు ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. అది చూసిన పిల్లలు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read also: సీనియర్ ఎన్టీఆర్ గారికి రాజేంద్రప్రసాద్ మధ్య ఉన్న ఈ అనుబంధం ఎంతమందికి తెలుసు ?