Advertisement
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం. 2015 సంవత్సరం జూలై 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీన్లు బోలెడు కనిపిస్తాయి. ప్రధానంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్ గా తీశారు రాజమౌళి.
Advertisement
Read also: సీనియర్ ఎన్టీఆర్ గారికి రాజేంద్రప్రసాద్ మధ్య ఉన్న ఈ అనుబంధం ఎంతమందికి తెలుసు ?
Advertisement
భారీతనంతో ఆసక్తిగా సాగే ఈ సీన్ దగ్గర ఇంటర్వెల్ పడుతుంది. ఈ సీన్లో భల్లాల దేవుడి విగ్రహ ప్రతిష్టకి రంగం సిద్ధం అవ్వడం.. అదే సమయానికి బాహుబలి వచ్చి అక్కడి జనాల మీద ఆ విగ్రహం పడకుండా కాపాడడం చూసాం. ఆ సమయంలో విగ్రహం కింద ఎరుపు రంగు పొడి ఒకటి ఉంటుంది. ఇది మీరు గమనించి ఉండరు. అయితే ఆ ఎరుపు రంగు పొడిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా..? దీన్ని చాలా మంది విజువల్ ఎఫెక్ట్ కోసం పెట్టారని అనుకుంటారు. కానీ ఆ పొడిని అక్కడ ఉంచడం వెనుక మరో కారణం ఉంది.
అదేంటంటే.. ఏదైనా ఒక భారీ విగ్రహాన్ని ఒకచోట ప్రతిష్టించేటప్పుడు దాన్ని ఉంచే చోట ఎత్తేసినట్లు పెట్టాల్సి వస్తుంది. దీంతో చుట్టూ ఉన్న ప్రదేశాలు ప్రకంపించినట్లు అవుతాయి. ఒక షాక్ లాంటిది వస్తుంది. అలా షాక్ లాంటి ప్రకంపనలు రాకుండా వాటిని శోషించుకునేందుకు ఆ ఎరుపు రంగు పొడిని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు అలా పొడిని ఏర్పాటు చేయడం వల్ల విగ్రహం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ఇలా సినిమాలలో కూడా చిన్న చిన్న విషయాలను దర్శకులు సీరియస్ గా తీసుకొని అమలు చేస్తుంటారు. అందుకే వారు తీసిన సినిమాలు విజయవంతం అవుతుంటాయి.
Read also: ఈ 5 లక్షణాలున్న అబ్బాయి లను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?