Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొంతమంది హీరోల కాంబినేషన్ చూస్తే అభిమానులకు ఎంతో ఆనందం కలుగుతుంది. మరో సినిమా రావాలని ఫీలింగ్ కలుగుతుంది. ఆ విధంగానే విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సమంత, అంజలి హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత రూపొందించిన మల్టీస్టారర్ మూవీ, ఈమధ్య కాలంలో ఇలాంటి మల్టీ స్టార్ మూవీస్ ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అలాంటి వాటిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.
Advertisement
పెళ్లి సందడి సినిమాని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరించారో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని కూడా ఆ విధంగానే ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. ఇందులో వెంకటేష్ మరియు మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్. కుటుంబ కథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఇప్పటికీ చిత్రం వచ్చి పదేళ్లు పూర్తయిపోయింది. అయితే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అనగానే, అందరికీ ఈ పది విషయాలు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. చిన్నోడు పూల కుంది ఎందుకు తన్నాడు?
2. సీత, గీత, కొండల్రావు సరే. చిన్నోడు, పెద్దోడు, రేలంగి మావయ్య ఇంకా మిగత వాళ్ల పేర్లేంటి ?
3. సీతకి అన్నీ ఎలా తెలిసిపోతుంటాయ్?
4. రేలంగి మావయ్య నవ్వడం తప్పా, ఇంకేం పని చేస్తాడు?
5. పెద్దోడు ఏం చేయకపోయిన, చిన్నోడికి డబ్బులు ఎలా ఇస్తాడు?
6. చిన్నోడు అంత సరసాలు చేసినా, ఏయ్ అమ్మయి ఎందుకు సీరియస్ అవ్వదు?
7. గీతాకి చిన్నోడు ప్రపోజ్ చేసాడా, చిన్నోడుకి గీత ప్రపోజ్ చేసిందా?
8. కొండల్రావు కి కజ్జికాయల ఫాంటసీ ఎందుకు?
9. అసలు కొండల్రావు మంచోడా చెడ్డోడా?
10. ఉన్నఫలంగా పెద్దొడు ట్రైన్ ఎక్కాడు.. TC ప్రాబ్లం ఎం రాలేదా?
Read also: యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..