Advertisement
నటుడు చత్రపతి చంద్రశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోను ఈయన కనిపిస్తుంటాడు. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన ఆర్ఆర్ఆర్ లోను ఓ కీలక పాత్రలో నటించారు. 2005లో విడుదలైన చత్రపతి సినిమాలో ఆయన నటన తరువాత తన పేరుని చత్రపతి శేఖర్ గా గుర్తింపుని అందుకున్నాడు. ఈయన చేసిన ఏ పాత్రకు అయినా పూర్తి న్యాయం చేయగల సత్తా కలిగిన నటుడు అయినందువల్ల రాజమౌళి తన సినిమాలలో ఈయనకి అవకాశాలు ఇస్తూ ఉంటారు.
Advertisement
Read also: రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచిన స్టార్ 10 హీరోయిన్ల లిస్ట్ వారెవరంటే ?
ఒక్క బాహుబలి సినిమాలో తప్ప రాజమౌళి అన్ని సినిమాలలోనూ చంద్రశేఖర్ ని చూడవచ్చు. అలా నటుడిగా అందరికీ పరిచయం ఉన్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిమందికే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు. చంద్రశేఖర్ భార్య పేరు నీలియ భవాని. ఖమ్మం జిల్లాకు చెందిన నీలియా భవానిని చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ కి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కి సినిమాలలో ఛాన్సులు వచ్చాయి.
Advertisement
వీరికి పూజిత, మహేశ్వరన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నీలియా భవాని కిక్ 2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్మెన్, పండగ చేసుకో వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది. అయితే వీరి పెళ్లి అయినా కొంతకాలం తర్వాత భవాని – శేఖర్ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకోగా.. పిల్లలు ఇద్దరు భవాని వద్దే ఉంటున్నారు. కూతురు ప్రస్తుతం మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతుంది. కొడుకు క్రికెటర్ గా స్థిరపడాలని ప్రయత్నిస్తున్నాడు.
Read also: ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేసేవాడంటే ?