Advertisement
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతి ఒక్క సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈయన కొన్ని సినిమాల్లో నటించి షూటింగ్ మధ్యలో ఆపేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో నటించిన బాలకృష్ణ ఈ సినిమాకు ముందే భగవాన్ శ్రీకృష్ణ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. అంతేకాకుండా ఎన్టీఆర్ హీరోగా నటించిన సామ్రాట్ అశోక చిత్రంలో బాలకృష్ణ కొన్ని పాత్రలు చేసే అవకాశం వచ్చింది. కానీ బాలకృష్ణ ఆ సమయంలో వేరే షూటింగ్ లో బిజీగా ఉన్నందున మోహన్ బాబు నటించారు.
Advertisement
Advertisement
ఇది కాక సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భైరవద్వీపం సినిమాలో నటించిన బాలకృష్ణ దాదాపు ఈ సినిమా పూర్తయ్యే సమయంలో ఈ సినీ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి మరణించారు. దీంతో ఆయన కొడుకు ఇది బ్యాడ్ సెంటిమెంట్ గా భావించి ఈ సినిమా మధ్యలో ఆపేశారు. అంతేకాకుండా సొంత దర్శకత్వంలో నర్తనశాల సినిమాలో బాలకృష్ణ షూటింగ్ ను మొదలుపెట్టగా సౌందర్య హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించడంతో అందులో ద్రౌపది పాత్ర మరే హీరోయిన్ దొరక్కలేనందున ఈ సినిమాను కూడా మధ్యలో ఆపేశారు.
ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో హర హర మహాదేవ సినిమాలో నటిస్తానని తెలుపగా సినిమా కథ నచ్చలేదని పక్కన పెట్టేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సినిమాలో చేద్దామనుకోగా ఇందులో రాష్ట్రపతి క్యారెక్టర్ ను అమితాబచ్చన్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక పాన్ ఇండియా సినిమా దశావతారం సినిమా ఛాన్స్ ను కూడా బాలయ్య కోల్పోయాడు. దాంతో ఆ సినిమాను కమల్ హాసన్ చేశాడు.
READ ALSO : రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచిన స్టార్ 10 హీరోయిన్ల లిస్ట్ వారెవరంటే ?