Advertisement
తెలుగులో ఏడాగతది అలరించిన సినిమాలలో లవ్ టుడే సినిమా కూడా ఒకటి. తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లని అందుకున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా చేసుకుని.. ఈ సినిమాను తెరకెక్కించారు ప్రదీప్ రంగనాథ్. అంతేకాదు ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించి మెప్పించడం జరిగింది. ప్రస్తుతం యువత ఎలా ఉంది? ప్రేమలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చక్కగా చూపించారు. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Advertisement
Read also: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా చూడగానే మనకు గుర్తుకు వచ్చే 10 డౌట్లు ఇవే ?
దీంతో ఈ చిత్రాన్ని అదే పేరుతో దిల్ రాజు తెలుగులోకి డబ్ చేశారు. ఈ చిత్రంలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమలో పడతారు. వారి వివాహాన్ని ఒప్పుకునే ముందు అమ్మాయి తండ్రి తెలివిగా వారిద్దరికీ ఒక పరీక్ష పెడతారు. ఇద్దరూ ఒకరి ఫోన్ ని మరొకరు మార్చుకొని రెండు రోజులు గడపాలి. దాంతో ఒకరి రహస్య స్నేహితులు మరొకరికి తెలిసిపోతారు. అప్పటివరకు ఇద్దరూ ఒకరికొకరు పారదర్శకంగానే ఉంటున్నామన్న భ్రమలోంచి బయటికి వచ్చి రక రకాల బావోద్వేగాలకి, గొడవలకి దిగుతారు. ఈ కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అచ్చం ఇలాంటి కంటెంట్ నే అనుసరించింది ఓ ప్రేమ జంట.
Advertisement
తమిళనాడు సేలం జిల్లాకు చెందిన అరవింద్ (23), కి ఓ యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికి ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకునేందుకు అచ్చం లవ్ టు డే సినిమాని స్ఫూర్తిగా ఫోన్లు మార్చుకున్నారు. అప్పుడు అసలు కథ మొదలైంది. అరవింద్ గురించి తెలుసుకునేందుకు ఆ యువతి అతని ఫోన్ బ్రౌజ్ చేస్తుండగా ఆ యువతీకి కళ్ళు చెదిరే దృశ్యాలు కనిపించాయి. ఆ ఫోన్లో మరో బాలికవి అసభ్యకర వీడియోలు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఈ విషయాన్ని బంధువుల సహాయంతో తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి రద్దు చేసుకుంది. ఆ తరువాత పోలీసులకి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అరవింద్ ని అరెస్ట్ చేశారు.