Advertisement
మామూలుగా ఎండాకాలంలో వరుస అగ్నిప్రమాదాల వార్తలు వింటుంటాం. కానీ, హైదరాబాద్ లో చలికాలంలో వినాల్సి వస్తోంది. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ లో ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది భవనంలోకి వెళ్లడానికి రెండు రోజులు పట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మిస్ అయ్యారు. అయితే.. ఫస్ట్ ఫ్లోర్ లో బాగా కాలిపోయిన అస్తిపంజరాన్ని గుర్తించారు. దీనిపై చర్చ సాగుతుండగానే.. మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Advertisement
హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లో ప్రస్తుతం ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో జనాల రద్దీ అధికంగా ఉంది. అయితే.. పార్కింగ్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరగడం అందర్నీ కంగారు పెట్టించింది. కారులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అవి పక్కనున్న కార్లకు అంటుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఐదు కార్లు దగ్ధం అయ్యాయి.
Advertisement
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఓ ఎలక్ట్రిక్ కారులోంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీకెండ్ కావడంతో నాంపల్లి నుమాయిష్ కు భారీగా జనం పోటెత్తారు. అగ్నిప్రమాదంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
మంటలను వెంటనే గుర్తించడం.. ఫైర్ సిబ్బంది రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటు నాంపల్లి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.