Advertisement
నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే అంశంపై ప్రజాగాయకుడు గద్దర్ మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే.. మొదట్నుంచి కేసీఆర్ అంటే పడదు అనేలా మాట్లాడిన ఆయన ఈమధ్యకాలంలో స్వరం మార్చారు. నూతన అసెంబ్లీ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినప్పటి నుంచి ఆయన తీరులో మార్పు మొదలైందని అంటున్నారు విశ్లేషకులు.
Advertisement
సకల సంపదలు గల దేశంలో దరిద్రం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేయాలని కేసీఆర్ కి ఈమధ్య గద్దర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో కేసీఆర్ ను.. అన్నా అంటూ సంబోధిస్తూ.. కొన్ని రోజులుగా ఆయన మాటలు చూస్తున్నానని, దేశంలో ప్రధాన సమస్యలపై కేసీఆర్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నానని బాంబ్ పేల్చారు. దేశంలో ప్రధాన సమస్య భూ సమస్యేనని.. దాన్ని కేసీఆర్ అడ్రస్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
అయితే.. గద్దర్ తీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు గద్దర్ రూ.150 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. మునోగుడు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా చేశారని అన్నారు. పాలనపరంగా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అవసరమా? అని ప్రశ్నించారు.
ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు పాల్. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని ఎద్దేవ చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు. లక్షల మంది వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నారని.. 70 శాతం ప్రజలు తన పాలన కోరుకుంటున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలనుకునేవారు ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు కేఏ పాల్.