Advertisement
వీరసింహారెడ్డి చిత్రంతో ఈ సంక్రాంతి పండుగ రేసులోకి దూసుకు వచ్చారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ క్రాక్ సక్సెస్ తో గోపీచంద్ మలినేని కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమా ముందు నుంచి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్ గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిర్యానీని రుచి చూపించారు.
Advertisement
అయితే, వీరసింహారెడ్డి టైటిల్ ఎలా పెట్టారని ఓ అభిమాని దర్శకుడు గోపీచంద్ మలినేనిని ప్రశ్నించగా, క్యారెక్టర్ పేరు వీరసింహారెడ్డి, టైటిల్ అదే అయితే రీచ్ ఎక్కువగా ఉంటది అని, వీరసింహారెడ్డిలో సింహం ఉందని, బాలయ్యకి సింహ అనే సెంటిమెంట్ కలిసి వస్తుందని వీరసింహారెడ్డి పెట్టినట్టు దర్శకుడు గోపీచంద్ వివరించారు. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ వెరైటీగా పొడుస్తుంది బాలయ్యని. ఆ సీన్ ని టర్కీలోని ఇస్తాంబుల్ లో తీశారు.
Advertisement
షూటింగ్ సమయంలో ఆ సీన్ చూసి అక్కడి ప్రజలు పరేషాన్ అయ్యారు. టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్లేస్ ఇస్తాంబుల్. షూటింగ్ అని తెలియని వారు కొంతమంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి కత్తులతో పొడిచే సీన్ చూసి ఆశ్చర్యపోయారని దర్శకుడు గోపీచంద్ వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా సమయంలో బ్లాక్ షర్ట్ అని స్వయంగా బాలయ్య గారే చెప్పారు. అఖండ సినిమాతో బాలయ్య మంచి ఫామ్ లో, క్రాక్ సినిమాతో గోపీచంద్ మలినేని నుంచి ప్రేక్షకులు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాను చేసినట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు.
READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?