Advertisement
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి కి ఏపీలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. కొండగట్టులో పూజల తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధికి తీసుకెళ్లారు పవన్. కొండపై అమ్మవారిని దర్శనం చేసుకున్న ఆయన.. కొండ దిగువన వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. పవన్ ని చూసేందుకు జనసైనికులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్షమని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. అమ్మవారి ఆశీస్సులను తీసుకున్న అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి నుంచి జై భవాని అంటూ అమ్మవారి పేరు స్మరించారు. అనంతరం ప్రసంగిస్తూ రాజకీయాల్లోకి యువతరం రావాలని, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
Advertisement
పూజల అనంతరం పవన్ భారీ ర్యాలీగా పార్టీ ఆఫీస్ కు వెళ్లారు. ఇంద్రకీలాద్రి కొండకు దగ్గరలో పవన్ గద పట్టుకున్న ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చేతిలో గద, బ్యాక్ గ్రౌండ్ లో ఓంకారం ఉండడం.. చూసి ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
వారాహి వాహనంపైకి ఎక్కి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు పవన్. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నుంచి అభిమానులు ఆయనపై పూల వర్షం కురిపించారు. డప్పు చప్పుళ్లు, బాణాసంచా పేలుళ్లతో విజయవాడ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గమ్మ ఆలయం బయట ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలతో సత్కరించారు. తన కోసం తరలి వచ్చిన ఆశేష జనవాహినికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.