Advertisement
శర్వానంద్ పలు సూపర్ హిట్ సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన చిన్న చిన్న పాత్రలు చేసిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శర్వానంద్ లో గమ్యం, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Advertisement

Sharwanand Wife
ఇది ఇలా ఉండగా, షేర్వా పెళ్లికి ఓకే చెప్పేసారని, మ్యాచ్ కూడా ఫిక్స్ అయిందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు శర్వా. తాజాగా టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయింది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కుటుంబానికి చెందిన అమ్మాయితో ఈరోజు శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయింది. శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు హీరో రామ్ చరణ్ మరియు ఉపాసన ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
Advertisement

Sharwanand Engagment Photos

Sharwanand Engagment Photos

Sharwanand Engagment Photos
దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. కాగా వధువు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వధువు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె మాజీ మంత్రిగారి మనవరాలట. పొలిటికల్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన ఆ అమ్మాయి తాతగారు గతంలో మంత్రిగా చేశారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






