Advertisement
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఫుల్ ఖుషి గా ఉన్న మూవీ యూనిట్ గత రాత్రి హైదరాబాదులో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే, ఈ విజయోత్సవ సభలో బాలయ్య సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్ లో మాట్లాడుతూ షూటింగ్ లో నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని ఇవే మాట్లాడుకునేవాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. కాగా బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
Advertisement
దీన్ని పదేపదే చెబుతూ సోషల్ మీడియాలో కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. ఇక బాలయ్య క్షమాపణలు చెప్పాలని, అక్కినేని అభిమానులు కోరుతున్న బాలయ్య నుంచి నామమాత్రపు స్పందన కూడా లేదు. బాలయ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్న ఈ విషయం గురించి నోరు మెదపడానికి ఆయన అసలు ఇష్టపడటం లేదు. అయితే బాలయ్య అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పినట్టు ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లెటర్ ను చూసిన నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా, కొంతమంది నెటిజెన్లు మాత్రం ఈ లెటర్ నిజమైన లెటర్ అని భావించి, వైరల్ చేస్తున్నారు. టిడిపి లెటర్ హెడ్ తో అక్కినేని అభిమానులకు క్షమాపణలు అని బాలయ్య చెప్పినట్టు ఆ లెటర్లో పేర్కొనడం గమనార్హం.
Advertisement
సంతకం లేని బాలయ్య లెటర్ నువ్వు నమ్మవద్దని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య అభిమానులు ఫైర్ కావడంతో ఫేక్ లెటర్ తో వైరల్ అయిన లెటర్ తో కూడిన ట్వీట్ ను డిలీట్ చేశారు. బాలయ్య మీడియా ముఖంగా లేదా ఆయన సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చే వార్తలను మాత్రమే నమ్మాలని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. ఫేక్ లెటర్ చేసిన వాళ్లపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని బాలయ్య ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ వివాదం విషయంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. బాలయ్య షూటింగ్ లకు ప్రాధాన్యత ఇస్తుండగా, ఈ వివాదం గురించి మాట్లాడవద్దని తన సన్నిహితులను కోరుతున్నట్టు బోగట్టా. అనిల్ రావిపూడి సినిమాకు రూ. 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి.
also read: నాకు 40… తనకు 20.! ఇది మా స్టోరి!