Advertisement
పెళ్లి.. జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఒక్కసారి పెళ్లి అయితే నిండు నూరేళ్లు తమ భాగస్వామితో… సంతోషంగా ఉండాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో… ఏ ఇంట్లో నైనా పెళ్లి జరిగితే… ఆ ఇంట్లో ఉన్న పెళ్లి ఈడుకు వచ్చిన… వారి గురించి బంధువులు అడగడం సహజం. అయితే వారి ప్రశ్నలు.. వారి బాగు కోసం కాకుండా మీ పెళ్లి.. ఎప్పుడు అంటూ వారిని అడుగుతారు ఆ బంధువులు. దీంతో వారు అయోమయానికి గురవుతారు. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే ఓ యువతికి ఎదురైంది. ఆ యువతి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పైన ఫోటోలో ఉన్న యువతి సోదరి వివాహం ఇటీవల జరిగింది. ఈ వివాహం చాలా అట్టహాసంగా జరిగింది. అయితే ఈ వివాహానికి వచ్చిన బంధుమిత్రులు… పైన ఫోటోలో ఉన్న యువతి పెళ్లి గురించే పదేపదే అడిగారు. దీంతో ఆ యువతి ఏం చెప్పాలో అర్థం కాకుండా… లో లోపల ఆందోళనకు గురయింది.
Advertisement
అంతేకాదు… నాకు పెళ్లి చేసుకునే వయసు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడ తనకు ఇష్టం లేదంటూ… తన మనోవేదనను వెల్లడించింది. చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకోవడం ఏంటని నిలదీసింది. నాకు ఒక డ్రీమ్ ఉంటుంది… లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని చెబుతోంది. 30 సంవత్సరాలు దాటిన ఒక వ్యక్తికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు… నేను కూడా సరైన సమయంలో సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెబుతోంది. కానీ ముందు తన లైఫ్ లో ఓ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటోంది ఈ యువతి. మరి ఈ యువత గురించి మీ సలహాలు చెప్పండి.
Also Read: సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 10 వస్తువులు