Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు… మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం :- ఒక స్థిరాస్తి కొనుగోలుకు అడ్డంకులు తొలగిపోగలవు. మీ యత్నాలు గుంభనంగా సాగించాలి. మీ సంతనం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ విషయాలపై దృష్టిసారిస్తారు. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. నూతన దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.
వృషభం :- వ్యాపార వర్గాల వారు పనివారలు, కొనుగోలుదార్లను కనిపెట్టుకోవటం ఉత్తమం. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. వాణిజ్య ఒప్పందాలు, హామీల విషయంలో అనుభవజ్ఞుల సలహా పాటించటం క్షేమదాయకం. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. దుబారా ఖర్చులు అధికం.
మిథునం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. అన్ని రంగాల వారికీ మొదట నిరాశ కలిగినా తర్వాత పురోభివృద్ధి.
కర్కాటకం :- ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు మందకొడిగా వుండగలదు. చిన్ననాటి మిత్రులతోగత అనుభవాలు ముచ్చటిస్తారు. మీ గౌరవ, అభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగ విషయంలో లాభమైనా, నష్టమైనా మీ స్వయంకృతమే. ఖచ్చితంగా మాట్లాడటం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు.
సింహం :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఇతరుల సలహా కంటె సొంత నిర్ణయాలే మేలు. దంపతుల మధ్య దాపరికం తగదు.
కన్య :- మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు.
Advertisement
తుల :- వస్త్ర వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. ఇతరులను ధనసహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు ఆటంకాలు, జాప్యం తప్పవు. కళ, క్రీడ, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించాలి.
వృశ్చికం :- మీ సమర్థత, నిజాయితీలకు ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ముక్కుసూటిగా పోయే మీ స్వభావంవల్ల ఇబ్బందులెదుర్కుంటారు. పత్రికా, మీడియా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలలో భక్తిపరమైన ఆలోచనలు అధికమవుతాయి.
ధనస్సు :- కాంట్రాక్టర్లకు రావలసిన ధనం సకాలంలో అందకపోవడంతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువవహించండి. ప్రభుత్వ కార్యక్రమాలలోనిపనులు చురుకుగా సాగుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
మకరం :- స్త్రీలు టి.వి, ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తగలవు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాట వచ్చును. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయంఅందిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందు లెదుర్కుంటారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికమవుతుంది.
కుంభం :- తల, ఎముకలకు సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసి పోగలవు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం ఉత్తమం. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి.
మీనం :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధువులు మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గృహ నిర్మాణాలకు కావలసిన అనుమతులు, వనరుల కోసం తీవ్రంగా యత్నిస్తారు. మిత్రులతో కలిసి సభ, సమావేశాలలో పాల్గొంటారు.
also read: నాకు 40… తనకు 20.! ఇది మా స్టోరి!