Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగారు హీరో రవితేజ.. మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అనేక బాధలు అనుభవించి ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ సెకండ్ హీరోగా కెరియర్ మొదలుపెట్టి స్టార్ హీరోగా మారారు. అయితే ఇండస్ట్రీలో అందరు హీరోల యాక్టింగ్ ఒక తీరు ఉంటే రవితేజ యాక్టింగ్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుందని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ గాని, ఎమోషనల్ సీన్స్ కానీ,కామెడీ సీన్స్ గానీ ఏ పాత్ర అయినా సరే రవితేజ అలవోకగా చేసేస్తారు. అంతటి స్టార్డం సంపాదించుకున్న మాస్ మహారాజా బాగానే సంపాదించారట.. ఆయనకు ఎన్ని కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి.. ఒక సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. రవితేజ నీకోసం అనే మూవీ ద్వారా హీరోగా పరిచయం అయ్యారు.
Advertisement
Advertisement
ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ అవడంతో, ఇడియట్ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. దీంతో స్టార్ హీరోగా ఎదిగారు. అలా వరుస విజయాలు అందుకుంటున్న రవితేజ జీవితంలో ఒక్కసారిగా ఫ్లాపులు వచ్చాయి. దీంతో కెరియర్ పోతుంది అనుకున్న సమయంలో మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు. ధమాకా మూవీతో సక్సెస్ అందుకున్నారు.. అంతేకాకుండా సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో నటించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక రవితేజ పారితోషికం విషయానికి వస్తే తన కెరియర్ మొదట్లో తక్కువగానే తీసుకున్నారు. ఆ తర్వాత రెండు మూడు సక్సెస్ లు అందుకోవడంతో పది నుంచి 12 కోట్లు తీసుకున్నారట.
క్రాక్ సినిమా తర్వాత 15 కోట్లు, ఇక ధమాకా మూవీ తర్వాత ఏకంగా 20 కోట్లు తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రవితేజ దాదాపుగా 150 కోట్ల నికర ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 కోట్ల విలువచేసే ఇడ్లు, 6 కోట్ల విలువైన కార్లు ఇతర వస్తువులు, 50 కోట్ల విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో సగం ఆస్తులు తన భార్య కళ్యాణి పేరిటే రాసినట్టు సమాచారం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంతటి స్టార్ గా మారిన రవితేజకు ఇండస్ట్రీలో మరింత పేరు రావాలని కోరుకుందాం.
also read:రాహుల్ గాంధీకే ఎందుకిలా..?