Advertisement
అప్పుడు ఆమె వయస్సు 12 సంవత్సరాలు. ఆ వయసులో ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు నేను నిరాకరించా. అది సరి కాదనిచెప్పా. దాంతో ఆమె ఏమీ అనలేదు. కానీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో రెండు స్వీట్లు తెచ్చి నాకిచ్చింది. అంతే అప్పుడే ఆమె పట్ల నాలో ప్రేమ వికసించింది. ఆ తర్వాత నేను పదేళ్లపాటు కష్టపడి పని చేసా. దాంతో ఆమె తండ్రి మా పెళ్ళికి అంగీకరించారు. నిజానికి ఆయనకు స్థలం ఉంది. సొంత ఇల్లు ఉంది. కానీ నేను ఓ అనాధను. అయినా నేను పడే కష్టాన్ని చూసి ఆయన ముగ్ధుడయ్యాడు. అందుకే తన కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లయ్యాక నా భార్యను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడిని. నిత్యం పనికి వెళ్లాలి.
Advertisement
వెళ్లకపోతే పూట గడవదు. ఆకలితో పస్తులు ఉండాలి. అలా ఉన్నా మంచిదే కానీ నా భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళేందుకు నాకు మనసొప్పేది కాదు. కొన్నిసార్లు ఆమెను వదిలి దూరంగా కొన్ని రోజుల పాటు పనికి వెళ్లాల్సి వచ్చేది. అయినా మధ్య మధ్యలో అనుకోకుండా వచ్చి ఆమెను చూసే వాడిని. ఆమెను వదిలి ఉండాలంటే నా ప్రాణం పోయినట్లు అనిపించేది. నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా వేడివేడి భోజనాన్ని ఆమె నాకు వడ్డిస్తుంది. కొంత కాలానికి ఆమె కూడా రోజు పనికి వెళ్లడం ప్రారంభించింది. నేను పని నుంచి త్వరగా వస్తే ఆమె కోసం వేచి చూసేవాన్ని. తర్వాత కొన్ని రోజులకు సాయంత్రం పూట ఇంటిదగ్గర కోడిగుడ్లను అమ్మడం ప్రారంభించను.
Advertisement
దాంతో మాకు అదనంగా కొంత ఆదాయం వచ్చేది. అలా ఐదేళ్లపాటు కష్టపడి కొంత సంపాదించుకోగలిగాం. కానీ దురదృష్టవశాత్తు నా మామ ఇల్లు నదిలో వచ్చిన వరదకు కొట్టుకుపోయింది. దీంతో వారు అక్కడే ఒక చిన్న గుడిసె వేసుకున్నారు. వారికి సహాయం అందించేందుకు నా భార్య వెళ్ళింది. ఆమె కోసం ఎదురు చూస్తున్నా. నా భార్య తన తల్లితో పాటు ఇరుగుపొరుగున ఉన్న మరో నలుగురికి ఇండ్లను మళ్ళీ కట్టుకుని ఎందుకు సహాయం చేస్తుంది. ఆ ఇండ్లను కట్టేందుకు మాకు చేతనైనంత సహాయాన్ని ఆర్థికంగా మేము అందిస్తున్నాం. ఆ పని ముగియగానే నా భార్య మళ్ళీ ఇంటికి వస్తుంది. అప్పటి వరకు నేను ఆమె కోసం వేచి చూడక తప్పదు. పేదరికం ఎంత ఉన్న ప్రేమ వికసిస్తూనే ఉంటుంది. ప్రేమ, అనుబంధం మరింత బలపడితే పేదరికం దానంతట అదే పోతుంది. ఇది నిజమేనేమో.
READ ALSO : 2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా హనీ రోజ్ నటించిందని తెలుసా ? ఏ సినిమాలో అంటే ?