Advertisement
ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం పనులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. అలా వాస్తు నమ్మేవారు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా మన ఇండ్లలో దేవుడికి అగరుబస్తిలను వెలిగిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో అగరువత్తిని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటూ ఉంటారు. అందుకని ప్రతిరోజు తప్పనిసరిగా చాలామంది అగరువత్తిని వెలిగిస్తూ ఉంటారు. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియా వంటివి తొలగిపోయి ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతారు. ఈ విధంగా ప్రతిరోజు అగరువత్తిని వెలిగిస్తూ ఉంటారు.
Advertisement
Advertisement
అయితే అలాంటి అలవాట్లు మీకు ఉన్నట్లయితే ఇప్పుడే మానుకోండి.. అంటే పూర్తిగా కాదు అగరుత్తిని మంగళవారం, ఆదివారం రోజున అస్సలు వెలిగించకూడదట. మంగళవారం, ఆదివారం రోజున అగరువత్తిని వెలిగించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వేద పండితులు అంటున్నారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ తప్పును చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ విధంగా మీరు అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఉండవచ్చని తెలియజేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మనం చేసే చిన్న తప్పులు మనల్ని ఎన్నో రకాల సమస్యల్లో పడేస్తూ ఉంటాయి. కాబట్టి వేద పండితులు చెప్పిన ఈ చిట్కాలను పాటించి ఎలాంటి బాధ లేకుండా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండటం మంచిది.
also read: