Advertisement
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో అందోళన నెలకొంది. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, అత్త పురంధేశ్వరి ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే, నందమూరి అభిమానులు భారీగా తరలిరావడంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Advertisement
మాజీ సీఎం చంద్రబాబు, లకృష్ణ కూడా అక్కడకు వెళ్లారు. వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తారకరత్నకు ఐసీయూలో చికిత్స అందుతోందని తెలిపారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
Advertisement
ఈ ఆస్పత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటికీ.. అక్కడికంటే బెంగళూరులో ట్రీట్ మెంట్ బెటర్ గా ఉంటుందనే ఉద్దేశంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు తరలించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లి గుండెపోటుకు గురయ్యారు తారకరత్న. అయితే.. పరీక్షలు చేసే కొద్దీ ఆయన ఆరోగ్యానికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన అత్యంత అరుదైన మెలేనా వ్యాధితో బాధపడుతున్నట్టు నారాయణ వైద్యులు తెలిపారు.
మెలేనా వ్యాధి జీర్ణాశయాంతర రక్తస్రావానికి సంబంధించింది. దీని బారినపడిన వారి మలం నల్లగా, జిగురుగా వస్తుంది. మెలేనా వల్ల జీర్ణాంతర ట్రాక్ట్ తోపాటు నోరు, అన్నవాహిక, పొట్ట, చిన్నపేగు మొదటి భాగం రక్తస్రావం అవుతుంది. కొన్ని కేసుల్లో ఎగువ జీర్ణాశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు ఆరోహణ భాగంలోనూ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. మెలేనా వల్ల శరీరంలో రక్తం స్థాయిలు క్రమంగా పడిపోతాయి. రక్తస్రావం అనీమియాకు దారితీస్తుంది. ఫలితంగా బలహీనంగా మారిపోవడమే కాక, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శరీర రంగు మారడం, అలసట, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.