Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లందరిలో రాజమౌళి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన డైరెక్టర్. ఆయన ఒక్కరే కాదు ఇండస్ట్రీలో వారి ఫ్యామిలీ నుంచి చాలామంది ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన వారే. అందుకే సినిమా లవర్స్ అందరికీ వీరి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా రాజమౌళి అంతటి డైరెక్టర్ కావడానికి కారణం కూడా వారి ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా రాజమౌళి వాళ్ళ నాన్న రైటర్ విజయేంద్రప్రసాద్, రాజమౌళి భార్య కాస్ట్యూమ్ డిజైనర్ , అన్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్, రాజమౌళి వాళ్ళ వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్, రాజమౌళి కొడుకు కార్తికేయ సినిమాకు aసంబంధించిన అన్ని పనులు చూసుకుంటాడు. ఈ విధంగా వారి కుటుంబం మొత్తం సినిమా అంటే పిచ్చి ఉన్నవారే.
Advertisement
అందుకే రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా కష్టపడుతూ హిట్స్ పడుతూ ఉంటారు. ఇదంతా చెప్పడానికి బాగానే ఉన్నా , వీరు ఈ స్టేజికి రావడానికి ముందు చాలా కష్టపడ్డారు అనే విషయం చాలామందికి తెలియదు. కొన్నిసార్లు తినడానికి తిండి లేకుండా ఉండేవారట. ఆ సమయంలో రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ రాసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఆయనకు ఆఫర్స్ కూడా ఉండేవి కావు. అంతేకాకుండా కీరవాణి గారి ఫాదర్ శివశక్తి దత్త కూడా లిరిక్స్ రాసేవారు ఆయన కూడా వర్క్ లేక ఖాళీగా ఉండేవారు. ఆ టైంలో రాజమౌళి, కళ్యాణ్ మాలిక్, కాంచి, శ్రీలేఖ, వీళ్ళందరూ చిన్నవాళ్లే కావడం వల్ల స్కూలుకు వెళ్లి చదువుకునేవారు.
Advertisement
వీళ్లది ఉమ్మడి కుటుంబం కావడంతో చిన్న పెద్ద అంతా కలిసి 25 మంది ఉండేవారు. ఎవరికి ఏ పని లేదు. ఈ సమయంలోనే కీరవాణి ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి వద్ద అసిస్టెంట్గా చేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని మొత్తం పోషించే వారట. తన భార్య వల్లి కూడా ఇంటి పెద్దగా ఉండి చిన్నపిల్లలుగా ఉన్న రాజమౌళి వాళ్ళ బ్రదర్స్ అందరికీ ఏ వంట కావాలంటే అవి చేసి పెట్టే వారట. ఈ విధంగా కీరవాణి రెండు నుంచి మూడు సంవత్సరాలు కుటుంబాన్ని మొత్తం పోషించారు. అందుకే ఇప్పటికి రాజమౌళికి కీరవాణి అన్నా వల్లి అన్నా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ఒక్క విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరిని మించిన వాళ్లు ఎవరూ లేరని చెబుతూ ఉంటారు రాజమౌళి.
also read:త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ గమనించారా..?