Advertisement
పూరి జగన్నాథ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట. తన పెళ్లి సమయంలో కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరీకి ఆ నటి మరియు యాంకర్ ఎంతో సహాయం చేశారని పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. మరి వారు ఎవరో ఎప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన లావణ్య అనే ఆవిడను ప్రేమించి పెళ్లాడారు.
Advertisement
అయితే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయం అది. ఇదే సమయంలో లావణ్య పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో గుడిలోకి వెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన దగ్గర మూడు ముళ్ళు వేయడానికి కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారట. ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొన్నారని, నటి హేమ పెళ్లి బట్టలు కొనిపెట్టారని పలు సందర్భాల్లో పూరి జగన్నాథ్ తెలియజేశారు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ ను ఇతరత్రా సహాయం అందించారట.
Advertisement
ఇక వివాహం తర్వాత మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలో ఎదిగారు. మంచి పేరుతో స్టార్ డైరెక్టర్ గా అక్కడే సంపాదించుకున్నారు. చివరికి కొంతమంది స్నేహితులను నమ్మి తీవ్రంగా మోసపోయారు పూరి జగన్నాథ్. తను సంపాదించిన ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. ఏది ఏమైనా తన పెళ్లికి సహాయం చేసిన ఝాన్సీ మరియు హేమలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను అని పూరి జగన్నాథ్ అంటుంటారు.
READ ALSO : ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాలు