Advertisement
మహిళల జడల్లో తల తల మెరిసిపోయే మల్లెల గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. స్త్రీలు తలలో పూలు పెట్టుకోవడం అనేది భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయమైన విషయం. రకరకాల పుష్పాలను పలు సందర్భాలలో వాడినప్పటికీ మల్లెపూలు మాత్రం ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఏ పూలు ధరించిన మహిళలకు ప్రయోజనమే అయినప్పటికీ మల్లెపూలు ధరిస్తే ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు పూలు పెట్టుకోవడం అనేది మన ఇండియాలోనే మొదలైంది. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: మొన్న సుధీర్.. నిన్న అలీ.. ఇప్పుడు సుమ.. ఎందుకు వెళ్లిపోతున్నారో?
మల్లె పూలు పెట్టుకోవడం అనేది ఒక ఆయుర్వేద సాధన, పెళ్లయిన తర్వాత మొదటి రాత్రిన మహిళ మల్లెపూలు ధరించడం అనేది సహజం. ఈ మల్లెపూల సువాసన మెదడుని ప్రశాంతంగా ఉంచి భయాన్ని, సిగ్గుని తొలగిస్తుంది. బెడ్ మీద మల్లెపూలు చల్లడం వల్ల నూతన దంపతులకు ఉత్తేజం, ఆనందం పెరుగుతాయి. అయితే ప్రస్తుత కాలంలో యువత కార్యం తర్వాత సిగరెట్ తాగడాన్ని ఘనకార్యంగా ఫీల్ అవుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అనుకుంటున్నారు. నిజానికి దీనివల్ల శరీరానికి గాని, మెదడుకు గాని ప్రయోజనం ఉండదు. కానీ మల్లెపూల వల్ల ఇద్దరికీ ప్రయోజనమే అని నిపుణులు చెబుతున్నారు. మల్లెపూలను చనుబాలు ఇచ్చే స్త్రీలు ఎక్కువగా ధరించేవారు. మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల బిడ్డకు కావలసిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని పూర్వీకులు నమ్మేవారు.
Advertisement
అయితే ఇవి లాక్టేషనల్ ఆమెనోరియాను పెంచడమే కాకుండా.. పాల ఉత్పత్తికి కావాల్సిన గాలాక్టోపోయిసిన్ స్థాయిని పెంచుతుంది. మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల పుర్రె వేడిని జుట్టు ద్వారా మల్లెపూలు గ్రహించి ఆ వేడిని బయటకి పంపిస్తాయి. చల్లదనం కోసం మల్లెపూలు పెట్టుకునేవారు. అయితే పూర్వం మగవాళ్ళు కూడా మల్లెపూలు ధరించే వారట. మగవాళ్ళకి కూడా జుట్టు పొడవుగా ఉండి మల్లెపూలను ధరించినప్పటికీ ఫ్యాషన్ కారణంగా మగాళ్లు పెట్టుకోవడం మానేశారు. అయితే నిద్రలేమితో బాధపడే వారికి కూడా మల్లెపూల వాసన ఓ మెడిసిన్ లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది అతి కోపాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు.
Read also: పిల్లలను స్కూటీపై ముందు కూర్చోపెడుతున్నారా? అయితే జాగ్రత్త..!!