Advertisement
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి గత శుక్రవారం చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయి. ఆయన మరణం తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలను కలచివేసింది. ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో శ్రీనివాసమూర్తి తన సేవలను అందిస్తూ వచ్చారు. శ్రీనివాసమూర్తి వాయిస్ కి ఓ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ అగ్ర హీరోలైన సూర్య, విక్రమ్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, టాలీవుడ్ లో రాజశేఖర్ ఇలా ఎందరో స్టార్ హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. సింగం, అపరిచితుడు, వీరుడొక్కడే, జనతా గ్యారేజ్ సహా పలు సినిమాలలో హీరో పాత్రలకు అద్భుతంగా డబ్బింగ్ చెప్పి ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు.
Advertisement
Read also: మా అన్న పెళ్లి చూసుకోవాల్సిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను ! అటు తరువాత ఏమయ్యిందంటే ?
Advertisement
అయితే అందరూ శ్రీనివాసమూర్తి గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నారు. కానీ మూర్తి చనిపోయింది గుండెపోటుతో కాదని.. అసలు విషయాన్ని చెబుతూ షాక్ ఇచ్చారు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు రవిశంకర్. ” మూర్తి మరణం గురించి వార్తలలో చూసి అందరూ హార్ట్ ఎటాక్ అని మాట్లాడుకుంటుంటే విన్నాను. కానీ అసలు జరిగింది అది కాదు. ఉదయం పూజ చేసే సమయంలో పూలు తెంపడానికి వెళ్లి రెండవ అంతస్తు నుండి పడిపోయారని ఆయన ఫ్యామిలీ చెప్పారు. మరి పైనుండి కాల్ స్లిప్ అయి పడిపోయారా? లేక ఆ సమయంలో ఏదైనా స్ట్రోక్ వచ్చి పడిపోయారా తెలియదు. కానీ పైనుండి నేరుగా రోడ్డుపై పడిపోయి ఉన్నారు. తనకి రోజు ఉదయాన్నే పూజ చేసే అలవాటు ఉందని నాతో చెప్పాడు. మూర్తికి దైవభక్తి ఎక్కువ.
ఎప్పుడైనా సరే దేవుడికి పూజ చేసిన తర్వాతనే బయటకు వెళ్తారు. ఆ సమయంలో రెండవ అంతస్తులో పూలుకోవడానికి వెళ్లి అక్కడి నుండి స్లిప్ అయి పడిపోవడంతో వెంటనే తలకు పెద్ద గాయం అయ్యి అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ మూర్తి ఇలా చనిపోవడం చాలా దురదృష్టకరం” అని చెప్పుకొచ్చారు రవిశంకర్. శ్రీనివాసమూర్తి లాంటి ఒక గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ లేని లోటు ఇండస్ట్రీకి ఎవరు తీర్చలేరేమో. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.