Advertisement
జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. పాదయాత్రలో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తరలించారు. కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాబాయ్ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయనతోపాటు తారకరత్న భార్య అలేఖ్య, తారకరత్న కుమార్తె కూడా అక్కడే ఉన్నారు.
Advertisement
నందమూరి అభిమానులు, పార్టీ వర్గాల వారు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడుతో సహా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి సుహాసిని, దగ్గుపాటి పురందేశ్వరి, బాలయ్యకి ఆప్తుడు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మంచు మనోజ్ తదితరులు ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. ప్రస్తుతం తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తారకరత్న ప్రాణాలు కాపాడడానికి బాలకృష్ణ, చంద్రబాబు చేస్తున్న కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ.. చాలామందికి తెలియని వ్యక్తి తెర వెనుక హీరో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర అని వారంతా అంటున్నారు.
Advertisement
చంద్రబాబు నాయుడు కర్ణాటక సీఎం బసవరాజు తో మాట్లాడి బెంగళూరు వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరినప్పటి నుంచి మొదలు తారకరత్నను బెంగళూరుకు తీసుకువచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతి ఒక్కటి సుధాకర్ దగ్గర ఉండి సిద్ధం చేశారని అంటున్నారు. తారకరత్నను దగ్గర ఉండి చూసుకునేందుకు సుధాకర్ ఆయన అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేసుకున్నారట. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, శివరాజ్ కుమార్ లతోపాటు ఆసుపత్రికి వెళ్లారు సుధాకర్. అంతేకాదు వీళ్లను రిసీవ్ చేసుకోవడానికి సుధాకర్ స్వయంగా ఎయిర్ పోర్ట్ కి కూడా వెళ్లారు. తెరవెనక ఉండి ఇంత శ్రమించిన ఆరోగ్య శాఖ మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం మంత్రిగారు అంటూ ఆయన ఫోటోతో కూడిన పోస్టులను నందమూరి అభిమానులు షేర్ చేస్తున్నారు.