Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎవరికైనా తెలుసు. అయితే తాజాగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై కీలకమైన పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జనవరి 27వ తేదీన యువగలం పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నందమూరి తారక రత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో వెంటనే కార్యకర్తలంతా కుప్పం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ గుండె ఆసుపత్రికి చేరవేశారు. ప్రస్తుతం తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Advertisement
ఈ తరుణంలోనే తారకరత్న కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను పరామర్శిస్తున్నారు. అయితే ఆయన కోలుకోవడానికి బాలయ్య, చంద్రబాబుతో పాటు తెరవెనుక మరో ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్. చంద్రబాబు కర్ణాటక సీఎంని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరినప్పటి నుండి ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నారు సుధాకర్. దీనికోసం అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారట.
Advertisement
ಬೆಂಗಳೂರಿನ ನಾರಾಯಣ ಹೃದಯಾಲಯಕ್ಕೆ ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ @tarak9999 ಅವರೊಂದಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಅವರ ಸಹೋದರ ಸಂಬಂಧಿ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರತ್ನ ಅವರ ಆರೋಗ್ಯದ ಸ್ಥಿತಿಯ ಬಗ್ಗೆ ವೈದ್ಯರಿಂದ ಮಾಹಿತಿ ಪಡೆಯಲಾಯಿತು.
1/2 pic.twitter.com/vRqFw3EIY9
— Dr Sudhakar K (Modi ka Parivar) (@DrSudhakar_) January 29, 2023
అయితే తారకరత్నను బెంగళూరు నుంచి తరలించింది మొదలు ప్రతిక్షణం వైద్యులతో మాట్లాడుతూ పర్సనల్ గా తీసుకొని ఏది కావాలంటే అది సిద్ధం చేయించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, శివరాజ్ కుమార్ లతో, పాటు హాస్పిటల్ కి వెళ్లారు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సుధాకర్ స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు. ఈ విధంగా తారకరత్న ఆరోగ్యం విషయంలో కష్టపడుతున్న ఆరోగ్య శాఖ మంత్రిని అందరూ అభినందిస్తున్నారు.
also read: