Advertisement
మన భారతదేశంలో భార్యాభర్తలు అంటే శివపార్వతులుగా భావిస్తారు. శివునికి రెండవ రూపము భర్తగా, పార్వతికి మరో రూపాన్ని భార్యగా భావిస్తారు. అలాంటి భార్యాభర్తల బంధం గొప్పది కాకుండా చాలా పవిత్రమైనది. మరి భార్యాభర్తల విషయంలో ఎవరూ ఎవరి మాట వినాలి.. భర్త చెప్పిన మాట భార్య వినాలని భార్య చెప్పిన మాట భర్త వినాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు.
Advertisement
ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సంసారమనే నావ నడుపుకుంటూ ముందుకు వెళితేనే జీవితంలో అద్భుతమైన దాంపత్యం గా పేరు పొందుతారు. కానీ కొంతమంది భర్తలు మాత్రం అస్సలు భార్య ను మాత్రం లెక్కచేయరు. వారి మాటలకు గౌరవం కూడా ఇవ్వరు. అలాంటి వారిని భార్య ఏవిధంగా మార్చాలి అంటే.. భార్య ఏవిధంగా ఉండాలో మనం చూద్దాం..?
1. భర్తకు సంబంధించినటువంటి వ్యతిరేక విషయాలు ఎవరితోనూ భార్య చెప్పకూడదు. అలాగే వారి మధ్య ఉన్న దాంపత్య రహస్యాలు కూడా ఎవరికీ వెల్లడించకూడదు. అప్పుడు భర్తకు తన భార్య మీద నమ్మకం ఏర్పడుతుంది. దీంతో మీ భర్త మీరు అడగక ముందే ఏదైనా విషయం ఉంటే మీతో పంచుకుంటారు.
2. కొంతమంది భార్యలు తన భర్త తన ముందు లొంగాలని అనుకుంటారు. భార్య మాట వినాలని ఆమె చెప్పుచేతుల్లో ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ క్షణంలో భర్త ఆలోచనలు మరింత మొండిగా తయారవుతాయి తప్ప వారి దారిలోకి మాత్రం పోరు.
Advertisement
Also Read: ‘జై భీమ్’ లో ‘సినతల్లి’ పాత్ర చేసిన ఈ నటి గురించి మీకు తెలియని విషయాలు ఏంటంటే..?
3. ప్రతి భార్య భర్త కు తన బిడ్డ తో సమానమే. కానీ భార్య తన భర్త మనసు లో ఉన్నటువంటి కోరికలని కానీ సమస్యలను కానీ ముందే గమనించి వాటిని ఎలాగైనా పోగొట్టే ప్రయత్నాలు చేయాలి.
4. ముఖ్యంగా భర్త ఆహారం తినేటప్పుడు భార్య అతనితో మాట్లాడరాదు. ఇంటి సమస్యల గురించి ఇంటి అవసరాల గురించి మరో గొడవ గురించి ఇలాంటివి ఏవి భర్త భోజనం చేసే సమయంలో భార్య మాట్లాడకూడదు.
5. భర్తకు రుచికరమైన ఆహారం పెట్టి, అతని కష్టాలలో ఎప్పుడు పాలుపంచుకొని ధైర్యాన్ని కల్పిస్తే భర్తలు ఎప్పుడు కూడా భార్యలతో ప్రతి విషయాన్ని పంచుకొంటారు.
Also read:
“సర్కారు వారి పాట” లో ఈ మిస్టేక్ ను గమనించారా….? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్టర్ సార్…!