Advertisement
టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది యాత్ర. దీంతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మొగిలి శ్రీ కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు లోకేష్. ఆ తర్వాత శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. అయితే.. బంగారుపాళ్యంలో ఉద్రిక్తత నెలకొంది.
Advertisement
అభివృద్ధి చేతగాని జగన్ అంటూ లోకేష్ అక్కడకు వచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అయితే.. పోలీసులు భారీ ఎత్తున అక్కడకు చేరుకుని.. సభకు అనుమతి లేదని అడ్డుకున్నారు. అయితే.. బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే లోకేష్ కు చెందిన 3 వాహనాలను సీజ్ చేశారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Advertisement
యువగళం స్పందన చూశాక సీఎంకు భయం పట్టుకుందని, అందుకే అడుగడుగునా అడ్డుపడుతున్నారని లోకేష్ ఫైరయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు సాగుతూనే ఉంటామని.. తగ్గేదే లేదన్నారు. జగన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సహించబోమని మండిపడ్డారు. అడ్డంకులు సృష్టిస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు లోకేష్.
గురువారం కూడా లోకేష్ సభకు అనుమతి లేదని ప్రచారరథాన్ని పోలీసులు ఆపారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో నోటీసులిచ్చారు.