Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్ధులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం తప్ప మరి ఏ అవినీతి ఆయన చేయలేదు. అయితే తాజాగా బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో మూడు పెళ్లిళ్ల విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు అసలు పెళ్లంటే కూడా ఏంటో తెలియదు.
Advertisement
నేను పెళ్ళికి సిద్ధంగా కూడా లేను. ఫ్యామిలీ వాళ్ళ ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకున్నాను. దాంతో మొదట్లో నా మొదటి భార్యతో నాకు మనస్పర్ధలు వచ్చాయి. అందుకే ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండోసారి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాను. ఆమెతో కూడా అభిప్రాయ వేదాలు రావడంతో ఆమెకు కూడా విడాకులు ఇచ్చాను. అయితే రెండు పెళ్లిళ్లు అయ్యాక నేను పూర్తిగా పెళ్లికి దూరంగా ఉండి ఒక యోగిలా మారిపోవాలి అని భావించాను. అంతేకాదు నాకు అసలు మూడో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. కానీ అనుకోకుండానే నా మూడో పెళ్లి జరిగిపోయింది.
Advertisement
అయితే చాలామంది నన్ను రాజకీయంగా ఢీకొట్టే సత్తా లేక నా పర్సనల్ విషయాన్ని తెరమీదకి తీసుకొచ్చి మూడు పెళ్లిళ్లు అంటూ ఎప్పుడూ నన్ను విమర్శిస్తూ ఉంటారు. అయితే నేను కూడా వాళ్లను ఏదో ఒక పర్సనల్ విషయంలో తిట్టొచ్చు కానీ నాకు అలా తిట్టడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్లకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నేను అలా తిట్టినప్పుడు తిట్లు తిట్టే వ్యక్తికి ఏం కాకపోవచ్చు కానీ ఆ మాటలు పడ్డ వాళ్ల భార్య, పిల్లలకు బాధనిపిస్తుంది. అందుకే నేను వాళ్ళని ఎప్పుడు కూడా మధ్యలోకి లాగాను. వేరే వాళ్ళ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకునే సంస్కారం నాకు లేదు అంటూ పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి చెబుతూనే తన మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
READ ALSO : అలనాటి అందాల తార హీరోయిన్ “దివ్య భారతి” మరణానికి ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?