Advertisement
ఏ ఇండస్ట్రీలో అయినా జనాలకి కథ కనెక్ట్ అయితే చాలు అది ఎంత చిన్న చిత్రమైనా పెద్ద హిట్ అవుతుంది. ఒకవేళ జనాలకి కథ నచ్చలేదు అంటే అది ఎంత పెద్ద భారీచిత్రమైన బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడం ఖాయం. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కాంతారా సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 15న అల్లు అరవింద్ తెలుగు హక్కులను కొనుగోలు చేసి తెలుగులో విడుదల చేశారు.
Advertisement
Advertisement
తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఏకంగా 400 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో హీరో రిషబ్ శెట్టి నటన అందరినీ ఆకట్టుకుంది. భూతకోల నృత్యం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రిషబ్ నటనపై ఎంతోమంది సెలబ్రిటీలు ప్రశంసలు అందించారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బిగ్ బాస్ ఓటిటి కంటెస్టెంట్ సోను గౌడ అనారోగ్యానికి గురయ్యాను అంటూ ఈ చిత్రం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
తాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన స్నేహితులు కాంతార సినిమా చూడమని సలహా ఇచ్చారు. ఈ సందర్భంలోనే కాంతార సినిమా చూసిన తర్వాత అందులో రిషబ్ శెట్టి నటన తనకు ఎంతో భయం వేసిందని ఆ భయంతోనే వారం రోజులపాటు జ్వరంతో బాధపడ్డానని ఏకంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.