Advertisement
ఫేస్ బుక్ లో వారి మధ్య ప్రేమ మొదలైంది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు. కానీ ఏడాది తిరగకుండానే వారి దాంపత్య జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఏమైందో తెలియదు కానీ అద్దె ఇంట్లో యువతి శవమై కనిపించింది. యువకుడి ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెంగళూరు విజయనగరకు చెందిన 22 ఏళ్ల సిరి అనే యువతికి కొన్ని నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఆదర్శ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొద్ది రోజులకు వీరి పరిచయం స్నేహంగా మారింది.
Advertisement
Read also: వీరసింహ రెడ్డి సినిమా విజయానికి “పరిటాల రవికి” ఉన్న లింక్ ఏంటో తెలుసా
ఆ స్నేహం కాస్త ప్రేమకు దారి తీసి ఇద్దరు కొన్ని నెలలు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి జీవించాలని భావించారు. తమ ఇళ్ళలో నుంచి బయటికి వచ్చేసారు. హసన్ జిల్లాలోని గుండెన హళ్లి గ్రామానికి చేరుకున్నారు. వారి ఇద్దరికీ పెళ్లి అయిందని చెప్పి ఓ ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఆ అద్దె ఇంట్లో కలిసి ఉండేవారు. ఇద్దరు కూడా ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఆ అద్దె నివాసంలో శవంగా కనిపించింది. దీంతో ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Advertisement
ఘటన స్థలికి చేరుకుని సిరి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఆదర్శ్ సంఘటన స్థలంలో లేకపోవడంతో అతడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే వీరిద్దరికీ పెళ్లి అయ్యిందా? లేదా? అన్నదానిపై కూడా క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు సహజీవనం చేస్తూ ఉండి ఉంటారని భావిస్తున్నారు. పరారీలో ఉన్న ఆదర్శ్ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు కానీ ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
Read also: లెజెండరీ సింగర్ వాణి జయరాం గారి మరణానికి వెనుక బిగ్ ట్విస్ట్ ! వెలుగులోకి నిజాలు !