Advertisement
వాణి జయరాం సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న గాయని. అలాంటి ఈ స్టార్ సింగర్ రాజకీయాలకు బలైపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయ సంగీత పరిశ్రమ అని చెప్పగానే అందరికీ బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే గుర్తుకు వస్తుంది. అందుకే వాణి జయరాం కూడా హిందీ ఇండస్ట్రీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తొలినాళ్ళలో ఆమె పైకి ఎదిగిన విధానం అందరికీ కళ్ళకు కట్టేలా చేసింది. అలాంటి స్టార్ సింగర్ వాణి జయరాం మరణించిన తర్వాత ఆమె చుట్టూ అనేకకథలను అల్లుతున్నారు.. ఆమె చనిపోయిందా.. చంపబడిందా..
Advertisement
ఆకస్మిక మరణమా.. సాధారణ మరణమా అనే కథలు వినిపిస్తున్నాయి.. ఇందులో వాస్తవాలు ఏంటి అనేది ఇప్పటికి నిర్ధారణకు రాకపోయినా ఆమె జీవితం మాత్రం చాలా భిన్నమైన విషయాలకు మేలవింపుగా కనిపిస్తోంది. వాణీ జయరాం చాలా సున్నితమైన మనసు కలిగిన సింగర్. ఆమెను తామేరాకు పై ఉన్న నీటి బొట్టుతో పోలుస్తారు చాలామంది. అలాంటి ఈమె భారతీయ నైటింగల్ గా పేరు సంపాదించుకుంటున్న తరుణంలో రాజకీయాలకు బలైపోయింది. ఆ విషయాలను కూడా పలు ఇంటర్వ్యూలలో ఆమె చెప్పుకొచ్చింది. అప్పట్లో టాలీవుడ్ లో లతా మరియు ఆశ టాప్ సింగర్స్. వారు నేర్పిన రాజకీయాలకు వాణీ జయరాం నెగ్గలేకపోయారు. అయినా తన లైఫ్ లో ఎలాంటి రెగ్యులేట్స్ లేవని చెప్పడం వాణి గొప్పతనం.
Advertisement
ఇక బాలీవుడ్లో తనకు స్థానం లేదు అనుకొని మద్రాస్ కు మకాం మార్చింది. భర్తతో కలిసి మద్రాస్ లోనే కొన్నాళ్ళు ఉంది. వాణి భర్త కూడా సంగీత కళాకారుడు . అలా కొన్నాళ్ళు జీవించారు. కానీ వీరికి పిల్లలు పుట్టలేదు. అలా వారు సంపాదించిన డబ్బులు ఎక్కువ భాగం ఇతరుల కోసమే ఖర్చు పెట్టారు. అలా వాణి జయరాం పాటలు పాడమే కాకుండా పెయింటింగ్స్ కూడా వేసేది. వాటితో మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా భక్తి పాటలు పాడడంలో వాణి జయరాం ముందుండేది అని చెప్పవచ్చు.
also read:వెంకీ చేయాల్సిన ఆ చిత్రంలోకి చిరు ఎలా వచ్చారో తెలుసా..?