Advertisement
దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న వాణి జయరాం ఆకస్మికంగా మరణించడం అందరినీ బాధించింది. అయితే ఆమె మరణం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికే పోలీసులు ఆమె మృతి గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో వాణీ జయరాం అంత్యక్రియలు జరిగాయి. ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం ఉండడంతో ఆమె మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఈ కేసు విషయంలో పోలీసులు ముందుకెల్లనున్నారని తెలుస్తోంది.
Advertisement
అయితే కళాతపస్వి కె విశ్వనాథ్ మరణాన్ని మరవకముందే వాణి జయరాం మృతి చెందడం ఇండస్ట్రీ వర్గాలను షాక్కు గురిచేస్తుంది. వాణి ఇప్పటికే 18భాషల్లో 10వేలకు పైగా పాటలు పాడి అరుదైన రికార్డు క్రియేట్ చేసుకోవడం గమనార్హం. 1945 సంవత్సరం నవంబర్ నెల 30వ తేదీన కలై వాణి గా జన్మించారు. 10 సంవత్సరాల వయసులోనే ఆలిండియా పాటలు పాడడం ద్వారా ఫేమస్ అయ్యారు. 1969 వ సంవత్సరంలో ఆమెకు పెళ్లయింది.
Advertisement
కానీ సంతానం కలగలేదు. అయితే ఐదు సంవత్సరాల క్రితం భర్త చనిపోయారు. ఇక అప్పటినుంచి వాణి ఒంటరి జీవితాన్ని గడుపుతూ వస్తోంది. అంతేకాకుండా వాణిజయరాం వివాదాలకు దూరంగా ఉండటంతో పాటుగా ఎవరికైనా ఆపదలో ఉంటే సహాయం చేసేదని సమాచారం. ఈ విధంగా ఎంతో పేరు తెచ్చుకున్న వాణి జయరాం ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె అభిమానులంతా కన్నీరు మున్నీరవుతున్నారు.