Advertisement
ఆంధ్రాలో కాపుల ఓట్లు చాలా కీలకం. పార్టీల వారీగా వీరిని విడగొట్టడంతో అన్నింటికీ మేలు జరుగుతోంది గానీ.. అందరూ ఏకతాటిపైకి వస్తే మాత్రం చరిత్రే. కానీ, అది జరగని పని. కీలక నేతలంతా వైసీపీ, టీడీపీలో ఉన్నారు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ఎవరూ వెళ్లే పరిస్థితి ఉండదు. అలా కాకుండా జనసేన గూటికి చేరే ఛాన్స్ లేదు. దీనివల్ల కాపులు గ్రూపులుగా ఉండడమే జరుగుతోంది. అయితే.. రాష్ట్రంలోని కాపులందరినీ ఏకం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు కొందరు. వారిలో హరి రామజోగయ్య ఒకరు.
Advertisement
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్న ఈయన.. ఈమధ్య కాలంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఆమధ్య దీక్ష అంటూ హడావుడి చేశారు. ఇప్పుడు మంత్రి అమర్నాథ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే.. మంత్రి కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది.
Advertisement
అమర్నాథ్ కు లేఖ రాసిన హరిరామ జోగయ్య.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు.. నీ మంచి కోరి చెబుతున్నా అంటూ హెచ్చరించారు.
పవన్ పై శనివారం అమర్నాథ్ విమర్శలు చేశారు. ఆయన టీడీపీ లో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాపులను తాకట్టు పెట్టేందుకు సిద్ధం అయ్యారని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హరి రామ జోగయ్య లేఖాస్త్రం సంధించారు. అయితే.. మంత్రి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ‘‘కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ గారికి రాయాల్సిన, చెప్పాల్సిన విషయాలు పొరబాటున నాకు రాసినట్టున్నారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అంటూ జోగయ్యకు కౌంటర్ ఇచ్చారు.