Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ చూశాక ముందస్తు ఎన్నికలు కన్ఫామ్ అనే చర్చ జరుగుతోంది. అభివృద్ధి పనుల్లో అధికారులను పరుగులు పెట్టించడం.. నాయకులను నియోజకవర్గాలకే పరిమితం చేయడం.. జిల్లాల టూర్లు చూసి రాజకీయ వర్గాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని ముందునుంచి చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పదే పదే చెబుతున్నారు. తాగాజా మరోసారి ఆయన ముందస్తు పక్కా అని మాట్లాడారు.
Advertisement
ఈనెల చివరి నాటికి తెలంగాణలో శాసనసభను రద్దు చేస్తారని అన్నారు ఉత్తమ్. రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పారు. ఈసారి కోదాడ, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. 50వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలా జరగక పోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు ఉత్తమ్. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. దేశాన్ని బీజేపీ మతపరంగా చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు.
Advertisement
ఉత్తమ్ వ్యాఖ్యలపై చర్చ సాగుతుండగా.. బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందని, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వస్తుందంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే ఉద్దేశం గానీ, ఆలోచన గానీ లేనే లేదన్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలు ఊహాజనితంగా ఉన్నాయని తెలిపారు. తనకు తానుగా ఏదేదో ఊహించుకుని బాధ్యతారాహత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనే లేనప్పుడు ఇక రాష్ట్రపతి పాలన ప్రస్తావన ఎందుకొస్తుందని ప్రశ్నించారు వినోద్. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ రద్దు కాదని, అలాంటి అవకాశమూ లేదని తేల్చి చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రే పలు సందర్భాల్లో దీనిపై క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా ప్రజలను గందరగోళంలోకి నెట్టేలా చూడడం కరెక్ట్ కాదన్నారు. ఎంపీ స్థాయిలో ఉండి ఇలా ఊహాజనితంగా వ్యాఖ్యలు చేయడం అనాలోచితమన్నారు వినోద్ కుమార్.