Advertisement
ఈ కాలంలో అంటే యూట్యూబ్ లో వీడియో సాంగ్స్, ట్రైలర్ వ్యూస్ రికార్డ్స్, ఓటిటి స్ట్రీమింగ్ రికార్డ్స్, సినిమా సాధించిన వందల కోట్ల కలెక్షన్ల గురించి చర్చలు, రచ్చలు జరుగుతున్నాయి కానీ అప్పట్లో ఒక సినిమా హిట్ అయింది అంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డు గా చెప్పుకునేవారు. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు ఇలా చెప్పుకునేవారు. టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ ప్రదర్శితమయ్యేవి. అలా ఓ రెండు సినిమాల విషయంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య మౌనంగానే మాటల యుద్ధం నడిచింది.
Advertisement
Read also: ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ చేసారు రాజమౌళి సర్ ! ఈ సీన్ లో ఉన్న మిస్టేక్ గమనించారా ?
ఆ సినిమాలు ఏవంటే.. 1996 జనవరి 12న కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం పెళ్లి సందడి. మ్యూజికల్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్, అల్లు అరవింద్ కలిసి నిర్మించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో వందరోజుల ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పెళ్లి సందడి అప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ సినిమాకి రాని కలెక్షన్లు కురిపించిందని.. రజతోత్సవం సందర్భంగా అల్లు అరవింద్ పాత్రికేయులతో చెప్పారు.
Advertisement
కొందరు మోహన్ బాబు పెదరాయుడు సినిమా ప్రస్తావన తెస్తే.. పేర్లు అనవసరం, మా సినిమాదే ఇప్పటివరకు అత్యధిక రికార్డ్ అని అన్నారు అల్లు అరవింద్. ఇక ఆ సమయంలో మౌనంగా ఉన్న మోహన్ బాబు ఆయన నటించిన అడవిలో అన్న షూటింగ్ సమయంలో తన పెదరాయుడు చిత్రం రికార్డులను ఎక్కడ, ఏ సినిమా జయించలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు “కాదని వాళ్ళను గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి” అంటూ ఛాలెంజ్ చేశారు. తనకి అంకెల గారి చేతకాదని కూడా అన్నారు. తాను ఖచ్చితమైన వాస్తవాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు మోహన్ బాబు. “మరి ఎవరి మాట నమ్మాలి? కలెక్షన్ల రికార్డు సంగతి ఎలా ఉన్నా వివాదాలతో ఇది కొత్త రికార్డు!” అంటూ కథనం ప్రచురించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.