Advertisement
జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ వర్ష అంటే తెలియని వారు ఉండరు. సీరియల్ ద్వారా కూడా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న వర్ష జబర్దస్త్ ద్వారా మరింత పెంచుకుంది. అయితే వర్ష పై ఈ షోలో వేసే పంచులపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా వర్ష సోషల్ మీడియాలో నిశ్చితార్థం అని చెప్పడంతో ఇలా రెడీ అయ్యానంటూ కామెంట్లు చేశారు. ఆమె వీడియో మరియు థంబ్ నేల్ చూసిన చాలామంది వర్షా కు పెళ్లి అయిందేమో అని అనుకున్నారు.
Advertisement
Advertisement
అయితే ఆ తర్వాత వీడియోలో వర్షా రాకేష్ సుజాతల నిశ్చితార్థానికి హాజరయ్యానని కామెంట్ చేసింది. అయితే లైక్స్ మరియు వ్యూస్ కోసం వర్ష ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ తరహా ప్రవర్తన వల్లే సెలబ్రిటీలపై నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి వర్ష ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
మరోవైపు జబర్దస్త్ షోలో వర్ష మగాడు మగాడు అంటూ బాడీ షేమింగ్ కామెంట్ల గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా యూట్యూబ్ లో వర్ష వీడియోలకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడం గమనార్హం. ఇక వర్ష సినిమాల విషయానికి వస్తే పాత్ర మరీ అద్భుతంగా ఉంటే నటిస్తానని చెబుతోందట. దీంతో చాలామంది నెటిజన్లు వర్ష మారాల్సిన అవసరం ఉందని కామెంట్లు పెడుతున్నారు.