Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నందమూరి తారకరత్న గురించే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో ఆయన పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన కండిషన్ సీరియస్ గా ఉండటంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం ఈ హీరో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ తరుణంలోనే తారకరత్న మరియు అతని భార్య అలేఖ్య రెడ్డి గురించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి..అలేఖ్య రెడ్డి ఫ్యామిలీ పర్సనల్ విషయాలు వారి పెళ్లికి ముందు ఏం జరిగింది అనే విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.. మరి ఆ వివరాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం.. తారకరత్న వివాహం చేసుకోవడానికి ముందే అలేఖ్య రెడ్డికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి ని ఆమె పెళ్లి చేసుకుంది.
Advertisement
అతనితో నాలుగు సంవత్సరాలు గడిపిన తర్వాత మనస్పర్ధల వల్ల వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. ఈ తరుణంలోనే తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్. ఈ తరుణంలోని వీరి మధ్య పేమ చిగురించి అది కాస్త పెళ్లి దాకా దారితీసింది. దీంతో ఇద్దరు కలిసి గుళ్లో వివాహం చేసుకున్నారు.
also read: ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ చేసారు రాజమౌళి సర్ ! ఈ సీన్ లో ఉన్న మిస్టేక్ గమనించారా ?