Advertisement
సాధారణంగా హీరోలు డబుల్ రోల్ చేయాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అగ్ర హీరోలు ఈ విషయంలో భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నందమూరి హీరోలు మాత్రం మూడు పాత్రలు చేసే విషయంలో భయపడటం లేదు. రెండు కాదు మూడు పాత్రలు అయినా సమర్థవంతంగా చేస్తామంటూ ధీమాగా ముందుకు వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్లో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో అదరగొట్టారు. లవ, కుశ, జై పాత్రలో నటించి మెస్మరైజ్ చేశారు.
Advertisement
కానీ ఈ సినిమా కేవలం నట విశ్వరూపం వల్లే హిట్ అయిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాల్లో రెండు, మూడు, నాలుగు పాత్రలకు కూడా నటించి మెప్పించారు. దానవీరశూరకర్ణ చిత్రంలో కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతం. ఇక చాలామంది హీరోలు ఎన్నో పాత్రల్లో నటించారు. ఇక కమలహాసన్ అయితే దశావతారంలో ఏకంగా 10 పాత్రల్లో నటించి మెప్పించారు. 1966 లో వచ్చిన నవరాత్రి సినిమాలో ఎన్టీఆర్ తొమ్మిది పాత్రలు వేశారు.
Advertisement
ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి కూడా మూడు పాత్రల్లో నటించారు. అయితే ఈ తరం హీరోల్లో మాత్రం ఎవరు ట్రిపుల్ రోల్స్ చేయట్లేదు. ఎన్టీఆర్, జై లవకుశ సినిమా కళ్యాణ్ రామ్ రాబోతున్న అమిగోస్ సినిమాలో త్రిబుల్ రోల్ లో చేశారట. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు మూడేసి పాత్రలకు పైగా నటించడం అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఈ రికార్డును బ్రేక్ చేసిన వారు లేరు.
READ ALSO : తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !