Advertisement
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ భార్య కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సినిమా రంగానికి దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. తారక్ సినిమాలో ఈవెంట్లకు మినహా ఇతర ఈవెంట్లకు లక్ష్మీ ప్రణతి దూరంగా ఉంటారు. ఇక తారక్ కూడా సినిమా లేకపోతే ఇల్లు, తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలు ఎక్కువగా బయటకి రావు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు మెయింటైన్ చేయదు.
Advertisement
Read also: తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !
ఎన్టీఆర్ ను వివాహం చేసుకునే సమయానికి లక్ష్మీ ప్రణతికి దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు నచ్చానా..? లేదా..? అని ఆమెను అడిగినట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే ప్రణతికి ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి ఇంట ఏ ఫంక్షన్ జరిగినా, లేదా ఎన్టీఆర్ తో బయటికి వచ్చిన ప్రణతి ఎంతో సింపుల్ గా వస్తుంది. డిజైనర్ డ్రెస్ లు, హంగులు, ఆర్భాటాలు, నగలు ఇవేమీ కనిపించవు. అందుకే ఆమె సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతారు.
Advertisement
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NTR 30 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు రానున్న ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే లక్ష్మీ ప్రణతికి ఓ తమ్ముడు ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు నారీన నితిన్ చంద్ర. త్వరలోనే నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక తమ్ముడితో ప్రణతి దిగిన క్యూట్ ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా ఓ లుక్కేయండి.
Read also: భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?