Advertisement
ఈమధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో,హీరోయిన్లు పెళ్లిబాట పడుతున్నారు. తాజాగా నాగశౌర్య కూడా పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా శర్వానంద్ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీగా ఉన్నారు. ఈ తరుణంలోనే మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కింది.. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే.. రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమాలో హీరోయిన్ గా చేసిన అతిథి గౌతం.
Advertisement
also read:పుష్ప మూవీలో ఆ పాత్ర కోసం సుహాస్ ఆడిషన్ కి వెళ్లారట.. కానీ చివరికి..!!
ఈ సినిమా ఆవరేజ్ అయినప్పటికీ హీరోయిన్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. ఈ చిత్రం తర్వాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సరైన అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీని వదిలి పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో కలిసిపోయింది. తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ అతిథి గౌతం పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అతిథి గౌతం బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా మైఖేల్ పల్కివాల అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆయన ముంబైకి చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. వీరిది ప్రేమ పెళ్ళ లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్ల అని తెలియదు కానీ ప్రస్తుతం వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read: