Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల నుండి సరైన హిట్ కోసం ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ తో హిట్ పడింది. ఆ వెంటనే అత్తారింటికి దారేది సినిమా రాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత పవన్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని ప్రేక్షకులకు తెగ నచ్చాయి.
Advertisement
Advertisement
అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ కొన్ని లాజిక్ లను కూడా మిస్ అయ్యాడు. అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం. సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సీనులో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే అదే సమయంలో ఆలీ వచ్చి ఒక సిగరెట్ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు. దాంతో పవన్ కళ్యాణ్ రగిలిపోయి తన బౌన్సర్లతో కొట్టిస్తాడు. అంతేకాకుండా తాను డ్రైవర్ కాదని, తన గురించి అసలు నిజాలు బయటపెడతాడు.
ఇక కోపంలో కొట్టిన పవన్ ఆ తర్వాత ఆలీకి లక్షల డబ్బు ఉన్న ఒక సూట్ కేస్ ఇస్తాడు. అయితే అప్పటికే ఈ సూట్ కేసును ఎమ్మెస్ నారాయణ పవన్ కు తెరిచి చూపించాడు కానీ ఆలీ మాత్రం అదే సూట్ కేసును తీసుకువెళ్లి ఓపెన్ అవ్వడం లేదని చెబుతాడు. అయితే ఈ మిస్టేక్ ను గమనించిన నెటిజన్లు త్రివిక్రమ్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
READ ALSO : పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజీనావో ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?